కరోనా : భారత్‌ వైపు ప్రపంచ దేశాల చూపు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే మహ్మమారి కరోనా వైరస్‌ భారత్‌పై ప్రభావం చూపినా.. కొంతమేర కట్టడి చేయగలిగాం అనేది అందరికీ తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రశంసలు కురిపించింది. అయితే కోవిడ్‌-19కు ఇప్పటి వరకు విరుగుడు కనిపెట్టకపోవడం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మలేరియా నిరోధానికి వాడే హైడ్రాక్సీ ‍ క్లోరోక్వీన్‌తో పాటు పారాసిట్‌మాల్‌ ఔషధాన్ని కరోనా బాధితులకు అందిస్తున్నారు. (మూడోదశకు కరోనా: ఎయిమ్స్‌)