ఆర్కేకు తృటిలో తప్పిన ప్రమాదం

గుంటూరు : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆర్కే హాజరయ్యారు. ఈ సమయంలో పెళ్లి వేదిక కూలడంతో ఆర్కే కాలికి గాయం అయింది. దీంతో ఆయనను గుంటూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాం తెలియాల్సి  ఉంది.