‘కరోనా’ అసలు కథ.. 40 ఏళ్ల క్రితమే ఆ బుక్‌లో!

ప్రస్తుతం కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైరస్‌ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వూహాన్‌ వైరస్‌ గురించి 40 ఏళ్ల క్రితమే ఓ నవలా రచయిత ఊహించాడు. 1981లో అమెరికా రచయిత డీన్ కూంట్జ్‌ తన థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్’లో వూహాన్‌ సిటీలో కొత్త వైరస్‌ ప్రస్థావన ఉంది. ఆయన తన ఫిక్షన్ స్టోరీలోని ఓ పేజీలో దీని గురించి రాశారు.    చదవండి: ఆరోగ్య శత్రువు కోవిడ్‌–19



వూహాన్‌ సిటీలోని మిలటరీ ల్యాబ్‌లో చైనా కావాలని బయో వెపన్‌ కోసం ఈ వైరస్‌ను సృష్టించినట్లు ఆ బుక్‌లో ఉంది. వుహాన్-400 అనే పేరుతో చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను క్రియేట్ చేసినట్లు ఆ ఫిక్షన్ స్టోరీలో రాశారు. ఈ వైరస్‌ శత్రుదేశాలపై పోరాటానికి చైనా తయారుచేస్తుందని, ఇది మనుషులపై మాత్రమే ప్రభావం చూపుతుందని అందులో ఉంది. దీని ద్వారా కొన్ని ప్రాంతాలను లేదా దేశాలనే నాశనం చేయవచ్చని అందులో పేర్కొన్నారు.  చదవండి:  కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే..